Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-06-2024 - సోమవారం... ఇతరులతో అతిగా మాట్లాడటం వద్దు

horoscope

రామన్

, సోమవారం, 24 జూన్ 2024 (05:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట : ఐ|| తదియ రా.2.58 ఉత్తరాషాఢ సా.5.47రా.వ.9.38 ల 11.10. ప.దు. 12.23 ల 1.15, పు.దు. 2. 59 ల 3.51.
 
మేషం: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కిరాగలవు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
వృషభం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహరాలు పరిష్కారమవుతాయి. విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు.
 
మిథునం: ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జాయింట్ వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. విద్యార్థులకు తొందరపాటు తగదు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
 
కర్కాటకం: రుణం తీర్చటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగావ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విద్యార్థినులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
సింహం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహరాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
 
కన్య: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ఆశాజనకం. కొంత మంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. పండ్ల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
తుల: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. వృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాల్లో ప్రనిణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ప్రేమ వ్యవహరాల్లో చికాకులెదురవుతాయి.
 
ధనస్సు: సమావేశాలు, చర్చల్లోకొందరి తీరు మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందో ళనలు వీడి శ్రమించిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికమవుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మకరం : కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారుఓర్పుతో పనిచేయవలసిఉంటుంది.
 
కుంభం : కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు. ఉద్యోగస్తుల బరువు బాధ్యతలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
మీనం : ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. ఉద్యోగ యత్నాలు కలిసిరాగలవు. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. వస్త్రలాభం, వాహనయోగం వంటి శుభపరిణామాలున్నాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-06-202 ఆదివారం దినఫలాలు - కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది...