Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్ ఫోన్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (20:44 IST)
ఇపుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఓ భాగమైపోయింది. తింటూ, చదువుతూ, పనిచేస్తూ, పడుకుంటూ కూడా ఫోన్‌ను వినియోగించేవారు అనేక మంది ఉన్నారు. ఈ మొబైల్ ఫోన్ వినియోగం అనేది ఇపుడు చాలా మందిలో ఓ వ్యసనంలా మారిపోయింది. 
 
అయితే, అదే ఫోన్ ఒకరి ప్రాణాల్ని నిలిపింది. వేగంగా దూసుకువస్తున్న బుల్లెట్‌ను ఆపి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బ్రెజిల్‍‌‌లోని పెట్రోలీనాలో అక్టోబరు 7వ తేదీన జరిగింది. ఓ దోపిడీ దొంగ ఓ వ్యక్తి నుంచి దోచుకునేందుకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడు. 
 
అయితే బుల్లెట్.. ఆ వ్యక్తి షర్ట్ జేబులోని ఐదేళ్ల పాతదైన మోటోరోలా జీ5 ఫోన్‌కు తగిలింది. తూటా శక్తి మొత్తం ఫోన్‌పైనే పడడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఫోన్ స్క్రీన్ బాగా దెబ్బతిన్నదే గానీ, ఫోన్‌ను దాటి బుల్లెట్ ముందుకు మాత్రం పోలేకపోయింది. ఫోన్ డ్యామేజ్ అయినా.. ఆ ఫోన్‌కు ఉన్న ‘హల్క్’ ప్రొటెక్షన్ కవర్ మాత్రం చెక్కుచెదరలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బాధితుడికి చికిత్సనందించిన వైద్యుడు పెడ్రో కార్వాల్హో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోలీనాలోని యూనివర్సిటీ ఆసుపత్రికి బాధితుడిని తీసుకొచ్చారని, చిన్న గాయం తప్ప పెద్ద గాయాలేవీ కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని పెడ్రో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments