Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#solarstorm జీపీఎస్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వుండవట.. మనం చేయాల్సిందల్లా..?

#solarstorm జీపీఎస్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వుండవట.. మనం చేయాల్సిందల్లా..?
, సోమవారం, 12 జులై 2021 (14:50 IST)
solar storm
High speed solar storm రానుంది. అంటే అతి భయంకర వేగంతో సౌర తుఫాను, ఇవాళ లేదా రేపు భూమిపై ఎటాక్ చేయనుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు. ఇది అలాంటిలాంటి సౌర తుఫాను కాదు. చాలా భయంకరమైనది. ఇది గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఇది ఇవాళ భూమిని తాకుతుంది అని అంటున్నారు. 
 
ఈ సౌర తుఫానును ఆపడం మన వల్ల కాదు. మనం చేయగలిగింది. మన సెల్‌ఫోన్లు ఫుల్లుగా రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే... ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కరెంటు పరికరాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ జాగ్రత్తలు తీసుకుంటే... సౌర తుఫాను సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
ఈ సౌర తుఫాను సూర్యుడి వాతావరణం నుంచి పుట్టిందని స్పేస్ వెదర్ డాట్ కామ్ తెలిపింది. దీని వల్ల భూమి అయస్కాంత క్షేత్రానికి హాని జరుగుతుంది అనే అంచనా ఉంది. సౌర తుఫాను అంటే... ఇదో రకమైన అత్యంత వేడి గాలి అన్నమాట. సూర్యుడి వాతావరణంలో... ఓ కన్నం ఉంది. దాన్నే ఈక్వటోరియల్ హోల్ (equatorial hole) అంటారు. అందులోంచీ ఇది విశ్వంలోకి దూసుకొచ్చింది. ఈ వేడి గాలి సెకండ్‌కి 500 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఇది మొత్తం భూమికి హాని చెయ్యకపోవచ్చుగనీ... దీని వల్ల అత్యంత ఎత్తులో అరోరాలు ఏర్పడతాయని అంటున్నారు.  
 
భూమికి ప్రమాదమా అంటే...? స్పేస్ వెదర్ డాట్ కామ్ ప్రకారం... భూమి బయటి వాతావరణం వేడెక్కనుంది. ఫలితంగా శాటిలైట్లపై ప్రభావం పడనుంది. అలాగే GPS వ్యవస్థ దెబ్బతిని... మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీ సిగ్నల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నారు. ఎక్కువ కరెంటు సప్లై అయ్యే ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. నాసా ప్రకారం ఈ సౌర తుఫాను వేగం గంటకు 16 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ లేకుంటే స్పాట్ ఫైన్ రూ.100, ఎవ‌రైనా ఫోటో తీస్తే అంతే