Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాఠశాల విద్యార్థులకు శృంగార విద్య... స్కూల్స్‌కు కండోమ్స్ పంపిణీ

పాఠశాల విద్యార్థులకు శృంగార విద్య... స్కూల్స్‌కు కండోమ్స్ పంపిణీ
, సోమవారం, 12 జులై 2021 (13:27 IST)
పాఠశాల విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్‌ను బోధించనున్నారు. ఈ పాలసీని చికాగో పబ్లిక్ స్కూల్స్‌ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్‌లోనే రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. 
 
ఈ విధానం ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 250 వరకు, హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్‌ ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచనున్నారు. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్ (చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.
 
ఈ సెక్స్ పాలసీపై సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ మాట్లాడుతూ, దీనిపై కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ… విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని తెలిపారు. సమాజం చాలా మార్పులకు గురైందన్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే… వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే… వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. 
 
చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ రూపొందించిన సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు ‘ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం…’ తదితర అంశాలను బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
 
మరోవైపు, సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని… అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని, దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Glass octopus: అద్భుత దృశ్యం.. గాజు రూపంలో ఆక్టోపస్