Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమిని తాకనున్న సౌర తుఫాను.. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం

భూమిని తాకనున్న సౌర తుఫాను.. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం
, ఆదివారం, 11 జులై 2021 (16:35 IST)
భారీ సౌర తుఫాను ఒకటి ఆది లేదా సోమవారాల్లో భూమిని తాకనుందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది. ఈ మేరకు జీ1 హెచ్చరికను జారీ చేసింది. 
 
గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తుఫాను ఆదివారం లేదా సోమవారం భూమి అయస్కాంత క్షేత్రం ప్రాబల్యంగల అంతరిక్ష ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఇది సూర్యుని వాతావరణంలో ఏర్పడిందని ఈ వివరాలను స్పేస్ వెదర్ డాట్ కామ్‌ వెల్లడించింది. 
 
ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ప్రాంతాల్లో నివసించేవారికి ఈ సౌర తుపాను ఖగోళంలో అందమైన, ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన కాంతిగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండేవారికి ఇది రాత్రి వేళ మేరుజ్యోతి (అరోరా)గా కనిపిస్తుంది. 
 
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపిన వివరాల ప్రకారం, గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌర తుపాను దూసుకొస్తోంది. ఈ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. సౌర తుపానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలుగుతుంది. 
 
సౌర తుపానుల కారణంగా భూమి వాతావరణం వేడెక్కవచ్చు. ఫలితంగా ఉపగ్రహాలపై నేరుగా ప్రభావం పడవచ్చు. జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీలపై ప్రభావం పడవచ్చు. విద్యుత్తు తీగెల్లో విద్యుత్తు ప్రవాహం అధికం కావచ్చు. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవచ్చు. 
 
ఈ సౌర తుఫాను ధాటికి ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావొచ్చని హెచ్చరించింది. భారీ స్థాయిలో శక్తివంతమైన కణాలు, భూమిని ఢీ కొట్టడం వల్ల విద్యుత్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది.
 
దీంతో ఉత్తర ధ్రువం నుంచి భారీ ఎత్తున వెలుగు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని వివరించింది. సూర్యుడిపై గల వాతావరణంలో గత వారం భారీ పేలుడు సంభవించిందనీ, ఈ ఘటనలో వెలువడిన కోట్లాది శక్తిమంతమైన కణాలు అతి వేగంగా భూమి వైపునకు దూసుకొస్తున్నాయని తెలిపింది. 
 
మరోవైపు, భూమి అయస్కాంత ఆవరణలో ‘ఈక్వినాక్స్‌ క్రాక్స్‌’  ఏర్పడుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది మార్చి 20, సెప్టెంబర్‌ 23 తేదీల్లో భూమి అయస్కాంత ఆవరణంలో ఈక్వినాక్స్‌ క్రాక్స్‌ ఏర్పడతాయి. ఈ సమయంలో విశ్వం నుంచి కణాలను భూమి తట్టుకోగలిగే సహజ శక్తి కొద్దిగా తగ్గుతుంది.
 
దీంతో భూమి ఆవరణంలో ఉన్న జీపీఎస్‌ వ్యవస్థలు, ఆకాశంలో ఎగురుతున్న విమానాలు సౌర తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నస్థాయిలో జియో సౌర తుఫాను ఈ నెల 14, 15 తేదీల్లో సౌర తుపాను భూమిని తాకొచ్చని చెప్పింది. ధ్రువాల వద్ద సంభవించే వెలుగులు మాత్రం స్కాట్‌లాండ్‌, ఉత్తర ఇంగ్లండ్‌, అమెరికాలోని మిచిగాన్‌, మైన్‌ ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి నిర్మాణపనుల్లో అపశృతి : కరెంట్ షాక్ తగిలి ఆరుగురి మృతి