Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్‌లో మరోమారు ఉద్యోగాల కోత!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (09:21 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోమారు ఉద్యోగాల కోత విధించారు. వివిధ ప్రాంతాల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించినట్టు గ్రీన్ వైర్ అనే మీడియా సంస్థ వెల్లడించింది. అయితే, ఈ దఫా ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్నది మాత్రం మీడియా సంస్థ వెల్లడించలేదు. గత యేడాదిలో 2.32 లక్షల నుంచి 2.27 లక్షల వరకు ఉద్యోగులను తొలగించిన విషయం తెల్సిందే. ఉద్యోగం పోయిన పరువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటుచేసుకున్నట్టుగా అర్థమవుతుంది. 
 
గత యేడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గించిన విషయం తెల్సిందే. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సాధారణమేనని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు. 
 
రాత్రికి రాత్రి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!! 
 
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస కండువా కప్పుకున్న వారిలో దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, సారయ్య, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌లు ఉన్నారు. వీరంతా గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి దీప్‌దాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాగా, గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారాస పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరిలు హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments