Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఘోరం.. స్కూల్ బస్సుకు బ్రేకుల్ ఫెయిల్..

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (08:58 IST)
హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 40 మందికిపై పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, ముందు వెళుతున్న అనేక వాహనాలను ఢీకొట్టింది. చివరకు ఓ భారీ ట్రక్కును ఢీకొట్టి నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో 9వ జాతీయ రహదారిపై ఈ వ్యాను వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేక పోయాడు. ఫలితంగా అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ ద్విచక్రవాహనదారుడి పరిస్థితి విషమంగా ఉంది. 
 
స్కూలు బస్సు, ఈ కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆ కారు వెళ్లి ఓ భారీ ట్రక్కును ఢీకొట్టింది. అయితే, ట్రక్కు అప్పటికే నెమ్మదిగా వెళుతుండగా కారులోని ఇద్దరు మహిళలు సులువుగా బయటకు రాగలిగారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పాఠశాల చిన్నారులకు ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments