Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (09:17 IST)
మీటూ ఉద్యమం దిగ్గజ టెక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చేరింది. ఈ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించినందుకు 48 మంది ఉద్యోగులపై ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ వేటు వేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
 
గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ మేరకు సుందర్ పిచాయ్ ఫాక్స్ న్యూస్‌కు ఈ మెయిల్ పంపించారు. 
 
లైంగిక వేధింపులకు పాల్పడిన 13మంది సీనియర్ మేనేజర్లను కంపెనీ తొలగించిందని పిచాయ్ అందులో పేర్కొన్నారు. గూగుల్‌లో ఎవరైనా ఉద్యోగినులు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే వారికి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
 
పనిప్రదేశంలో ఉద్యోగినిలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మెయిల్‌లో గూగుల్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ఇలీన్ నౌగటన్ సంతకం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం