Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీట్ రికార్డుల పంట.. ఏకంగా 50లక్షల డౌన్‌లోడ్స్.. ముఖేశ్ అంబానీ

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:59 IST)
Reliance Jio
రిలయన్స్ జియో నుంచి వచ్చిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్ రికార్డుల పంట పండిస్తోంది. 24 గంటల పాటు జియోమీట్ పనిచేస్తుంది. కేవలం ప్రొఫెషనల్ అవసరాలకు మాత్రమే కాకుండా పర్సనల్ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం కూడా ఈ యాప్ ఉపయోగించొచ్చు. జియోమీట్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. 
 
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కూడా జియోమీట్ ఉపయోగించొచ్చు. ఈ సేవలన్నీ ఉచితం. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ తర్వాత వచ్చినా.. ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఏకంగా 50లక్షల డౌన్‌లోడ్స్‌తో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 43వ వార్షిక సమావేశంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు. 
 
అంతేకాదు... జియోమీట్ సత్తా ఏంటో ఈ మీటింగ్ ద్వారా తెలిసిపోయింది. రిలయెన్స్ ఏజీఎం ఈసారి వర్చువల్ మీటింగ్ ద్వారా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వర్చువల్ మీటింగ్ కోసం జియోమీట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం విశేషం. 40 దేశాల్లో 468 పట్టణాల నుంచి 3,21,000 మంది జియో మీట్ ద్వారా రిలయెన్స్ ఏజీఎంలో పాల్గొనడం విశేషం.
 
ఎక్కడా ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా వర్చువల్ మీటింగ్ సాఫీగా సాగింది. జియోమీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ద్వారా ఎంత భారీ మీటింగ్ అయినా ఆర్గనైజ్ చేయడం సాధ్యమని రిలయెన్స్ వర్చువల్ ఏజీఎం నిరూపించింది. మరో వీడియా కాన్ఫరెన్సింగ్ యాప్ అయిన జూమ్‌కు జియోమీట్ గట్టి పోటీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. 
 
కరోనా వైరస్ సంక్షోభ కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌కి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు, క్లైంట్లతో మీటింగ్స్ పెట్టుకునేవారు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటివారికి జియోమీట్ ద్వారా సరైన ప్లాట్‌ఫామ్‌ను అందించింది జియో. జియో మీట్ యాప్‌ను ఉపయోగించి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments