జియో కస్టమర్లకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్... న్యూ ప్లాన్స్....

కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. తాజాగా మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (13:52 IST)
కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. తాజాగా మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. "హ్యాపీ న్యూ ఇయర్ 2018" పేరిట రెండు కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు రూ.199, రూ.299 ధరను కలిగివున్నాయి. 
 
ఈ రెండింటి వాలిడిటీ 28 రోజులు ఉండగా, రెండింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఇక రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.2 జీబీ డేటా లభిస్తుంది. అదే రూ.299 ప్లాన్‌లో అయితే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 
 
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు రూ.199 ప్లాన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో వాటికి పోటీగా జియో ఈ రెండు కొత్త ప్లాన్లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దేశీయ టెలికాం రంగంలో జియో తన సేవలు ప్రారంభించిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధానికి తెరలేచింది. ఫలితంగా అన్ని టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments