Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో జియో ల్యాప్‌టాప్‌లు.. రిటైల్ కస్టమర్ల కోసం కాదు...

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (14:59 IST)
అందరూ ఊహించినట్టుగానే రిలయన్స్ జియో ల్యాప్ టాప్‌ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. అయితే తొలుత ప్రచారం జరిగినట్టుగా రూ.15 వేల ధరకు మాత్రం కాదు. ఈ ల్యాప్ టాప్‌ ధరను రూ.19,500కు నిర్ణయించారు. అలాగే, వీటిని ఇప్పటివరకు రిటైల్ కస్టమర్లకు విక్రయించడం లేదు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం)పై విక్రయాలకు ఉంచింది. దీని ధర రూ.19,500గా ఖరారు చేశారు. 
 
జీఈఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసుగోలవు. మరి అందరికీ ఈ ల్యాప్ టాప్‌లు ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ లేదు. దీపావళి కానుకగా జియో ల్యాప్ టాప్ రిటైల్ కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. దీన్ని పూర్తిగా దేశీయంగానే తయారు చేసినట్టు జియో ప్రకటించింది.
 
కాగా, ఈ ల్యాప్ టాప్ 11.6 అంగుళాల హెచ్‌డీ‌ డిస్‌ప్లే, 1366/768 పిక్సల్స్ రిజల్యూషన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ అంటే ఈ ల్యాప్ టాప్ పవర్ ఫుల్ కాదని తెలుస్తోంది. 
 
పైగా ర్యామ్ సైజు కూడా తక్కువే. ధర తక్కువగా నిర్ణయించినప్పటికీ, ల్యాప్ టాప్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చూస్తే ఇదేమీ చౌక కాదని తేలిపోతోంది. బేసిక్ అవసరాలకు, ఆన్‌లైన్ క్లాస్‌లకు ఇది బాగానే ఉపయోగపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments