గౌహతి వేదికగా ఆదివారం రాత్రి పర్యాటక జట్టు సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 237 పరుగులు చేసింది. ఆ తర్వాత 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్లు లక్ష్య ఛేదనలో ఓపెనర్ బవుమా 0, రస్సో 0, మార్కాం 33, డి కాక్ 69 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ వీరవిహారం చేశాడు. కేవలం 47 బంతుల్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ మినహా మిగిలిన బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
కాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆటగాళ్ళు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లన నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్‌లు అర్థ సెంచరీలతో రాణించారు. దీనికితోడు కేఎల్ రాహుల్, కోహ్లీ, దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ల దెబ్బకు సఫారీ బౌలర్లు విలవిల్లాడిపోయారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వికెట్ కు 96 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 పరుగులు చేశారు. వీరిద్దరినీ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సఫారీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. మొత్తం 22 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
మరో ఎండ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 28 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 7 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా ఎక్కడా తగ్గకుండా, సఫారీ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 17 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రబాడా ఒక్క వికెట్ తీయకపోగా, 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. వేన్ పార్నెల్ (54 పరుగులు), ఎంగిడీ (49 పరుగులు), ఆన్రిచ్ నోర్జే (3 ఓవర్లలో 41 పరుగులు) అదే బాటలో నడిచారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఒక్కడే కాస్తంత ఫర్వాలేదనిపించాడు. మహరాజ్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
238 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ బవుమా, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రస్సోలు డకౌట్ అయ్యారు. దీంతో జట్టు స్కోరు బోర్డుపై ఒక్క పరుగుకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లను అర్షదీప్ సింగ్ పడగొట్టాడు.
గౌహతిలో పరుగుల వరద పారింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆటగాళ్ళు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లన నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్‌లు అర్థ సెంచరీలతో రాణించారు. దీనికితోడు కేఎల్ రాహుల్, కోహ్లీ, దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ల దెబ్బకు సఫారీ బౌలర్లు విలవిల్లాడిపోయారు.