Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు

tribute to gandhiji
, ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వద్ద ఉన్న గాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఆయన కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు సైతం గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమని, ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలన ఆయన పిలుపునిచ్చారు. తద్వారా గాంధీకి ఘన నివాళులు అర్పించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూణె చాందిని చౌక్ వంతెన 6 సెకన్లలో కూల్చివేత