Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూణె చాందిని చౌక్ వంతెన 6 సెకన్లలో కూల్చివేత

Advertiesment
pune bridge
, ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:27 IST)
పూణెలోని చాందినీ చౌక్ వంతెనను అధికారులు కూల్చివేశారు. కేవలం ఆరు సెకన్లలో ఈ వంతెన నేలమట్టమైంది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పేలుడు పదార్థాలతో ఈ వంతెనను సురక్షితంగా కూల్చివేశారు. ఇక్కడ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. 
 
ఈ వంతెన కూల్చివేతకు చార్జింగ్ విధానాన్ని అనుసరించారు. చార్జింగ్ విధానంలో వంతెనపై పేలుడు పదార్థాలను అమర్చారు. ఆపై వాటిని పేల్చడంతో పెద్ద శబ్దంతో ఆ వంతెన కూలిపోయింది. 100 మీటర్లకుపైగా ఎత్తున్న ట్విన్ టవర్లను కూల్చివేసేందుకు 9 సెకన్ల సమయం పట్టగా, పూణె వంతెన కూల్చివేతకు 6 సెకన్ల సమయం పట్టింది. 
 
ఈ కూల్చివేత పనుల్లో 60 మంది నిపుణులతో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని పూణె జిల్లా కలెక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్య పెళ్లికొడుకు ... వయసు 28 యేళ్లు - వివాహాలు 24... ఎక్కడ?