గౌహతి వేదికగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో భారత్ తలపడతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రెండు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 96 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 57, మరో ఓపెనర్ రాహుల్ 43 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు.
ఇదిలావుండగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తొలి టీ20లో ఆడిన జట్టునే బరిలో దించింది. ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌ను పరిశీలించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అటు సౌతాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ తబ్రైజ్ షంసీ స్థానంలో ఎంగిడీని తుదిజట్టులోకి తీసుకున్నట్టు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో నెగ్గి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గౌహతి టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం సొంతమవుతుంది.
తుది జట్ల వివరాలు..
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్షదీప్ సింగ్.
సౌతాఫ్రికా : టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రూసో, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, ఆన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడీ.