వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్.. వాట్సాప్ కాల్‌తో హ్యాకర్లకు పండగే

Webdunia
మంగళవారం, 14 మే 2019 (18:08 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ యూజర్లకు ఓ షాకింగ్ న్యూస్. వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు అప్రమత్తంగా వుండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వాట్సాప్‌లో హ్యాకర్లు సునాయాసంగా ఎంట్రీ అవుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. యూజర్ల డేటాను భద్రపరచడం పెను సవాలుగా మారుతోందని.. యూజర్ల డేటా మొత్తం లింకుల ద్వారా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుందని వాట్సాప్ వెల్లడించింది. 
 
ఒకరితో ఒకరు మాట్లాడేందుకు వాట్సాప్ యాప్‌ను బాగానే ఉపయోగిస్తున్నారు.. యూజర్లు. వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపడం, ఫోటో, వీడియోలు, ఆహ్వానాలు పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో హ్యాకర్లు ఎంట్రీ ఇస్తున్నారని.. ఈ సమాచారం అంతా సులభంగా దొంగిలించే వీలును కలిగివుందని వాట్సాప్ సంస్థ తెలిపింది. హ్యాకర్లు వాట్సాప్ కాల్ ద్వారా పనికానిచ్చేస్తున్నారు. 
 
వాట్సాప్ కాల్ చేయడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌పై కన్నేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇలా మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్ల నిఘాలో వుంటుందని వాట్సాప్ షాకింగ్ న్యూస్ వెలువరించింది.


దీనికి బ్రేక్ వేయాలంటే.. వాట్సాప్ యాప్‌ను అప్ డేట్ చేయాలని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ అప్ డేట్‌ను చేయడం ద్వారా హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చునని సదరు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments