ధోనీ సైగలు వైరల్.. చిటికెడు మట్టి తీసుకుని గాల్లో వదిలాడు.. (వీడియో)

మంగళవారం, 14 మే 2019 (17:44 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2019 టైటిల్‌ను జారవిడుచుకుంది. ఈ నేపథ్యంలో ధోని కెప్టెన్సీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం సీఎస్‌కే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అప్పర్ కట్ షాట్‌కు ప్రయత్నించాడు. 
 
మరోసారి అలాగే చేస్తాడని ఊహించిన ధోనీ ఓ అద్భుతం చేశాడు. సాధారణంగా డ్వేన్ బ్రావో స్లో బంతులు విసురుతుంటాడు. అక్షర్ పటేల్ అప్పర్ కట్‌ తప్పకుండా ప్రయత్నిస్తాడని ఊహించిన ధోని గాలి గమనంపై అవగాహన కోసం చిటికెడు మట్టి తీసుకుని గాల్లో వదిలాడు. అనంతరం తాహిర్‌ని ముందే హెచ్చరించాడు. 
 
క్యాచ్ రాబోతోందని హెచ్చరించాడు. ఆ తర్వాత బంతికే బ్రావో బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ డీప్ ఫైన్‌లెగ్‌లో ఉన్న తాహిర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ధోనీ సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

This is How.. Dhoni Captains #MSDhoni #DCvCSK #IPL2019 pic.twitter.com/jFqMQHev2s

— Dr KAMAL CHAUHAN (@imkamalchauhan) May 11, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏంటి..? ధోనీ తప్పుడు సలహాలు ఇచ్చాడా? కుల్దీప్ యాదవ్ ఏమన్నాడు?