Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యల రాజ్యంలో ప్రతి మగాడు కనీసం ఐదుగురు అమ్మాయిలను పెళ్లాడాల్సిందే... లేదంటే జైలే

Webdunia
మంగళవారం, 14 మే 2019 (17:41 IST)
మన దేశంలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరక్క అబ్బాయిలు నానా తిప్పలు పడుతున్నారు. కానీ, ఆ దేశంలో మాత్రం ప్రతి కుర్రోడు కనీసం ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ మేరకు ఆ దేశ రాజు ఉత్తర్వులు జారీచేశారు. ఇంతకీ ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసిన రాజు పేరు మెస్వాతి-3. ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ రాజు. 
 
దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు. ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అదేసమయంలో ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్‌లో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా అధికం. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని రాజాజ్ఞ జారీ అయింది. అన్నట్లు ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు.
 
మెస్వాతి-3 తండ్రి ఈయన కంటే ఘనుడే. ఆయనకు 70 మంది భార్యలు, 150 మందికిపైగా సంతానం ఉంది. కాగా, ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత పేదరికంలోకి జారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్వాజిలాండ్ రాజు మెస్వాతి-3 మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments