Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెలివరీ బాయ్స్‌తో అమ్మాయిలు జాగ్రత్త.. నెంబర్ ఫీడ్ ‌చేసుకుని.. అలాంటి?

Advertiesment
డెలివరీ బాయ్స్‌తో అమ్మాయిలు జాగ్రత్త.. నెంబర్ ఫీడ్ ‌చేసుకుని.. అలాంటి?
, ఆదివారం, 12 మే 2019 (16:49 IST)
పిజ్జాలు, బర్గర్లు, ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారా? డెలివరీకి వచ్చే బాయ్స్ వద్ద జాగ్రత్తగా వుండండి అంటోంది ఈ క్రైమ్ వార్త. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ ఫోన్ నెంబర్లను తీసుకుంటారు. అయితే అమ్మాయిల నెంబర్లు, అడ్రెస్‌లను ప్రత్యేకంగా తమ సెల్‌ఫోన్లలో ఫీడ్ చేసుకుంటున్న డెలివరీ బాయ్స్ అధికమయ్యారు. 
 
ఇలాగే అమ్మాయిల ఫోన్ నంబర్లు దాచుకుంటున్న ఓ డెలివరీ బాయ్... ఓ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలికి ఆ డెలివరీ బాయ్ అభ్యంతరకర మెసేజ్‌లు పంపాడు. చాలా అందంగా వున్నావని మెసేజ్‌లు పెడుతూ తరచూ వేధించేవాడు.
 
ఫుడ్ డెలివరీ చేసిన సంస్థ డోర్ డాష్‌కి ఈ వేధింపులపై కంప్లైంట్ ఇస్తే... ఇకపై ఆ మొబైల్ నంబర్ నుంచీ ఎలాంటి మెసేజ్‌లూ రావని ఆ సంస్థ హామీ ఇచ్చింది. కానీ వేర్వేరు నంబర్ల నుంచీ ఆ యువతికి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేక... విసుగెత్తిన యువతి... తన సమస్యను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంకా నెటిజన్లు డెలివరీ బాయ్స్ విషయంలో జాగ్రత్తగా వుండాలని సూచనలు ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనం చేసింది.. కానీ మనస్పర్థలు.. కొబ్బరిబొండాలు నరికే కత్తితో?