Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహిత వెంటపడిన మైనర్ బాలుడు.. వార్నింగ్ ఇచ్చేందుకు వెళ్తే.. క్రికెట్ బ్యాటుతో?

Advertiesment
Maruthinagar
, శనివారం, 11 మే 2019 (12:34 IST)
బెంగళూరులో ఓ వివాహితను మైనర్ బాలుడు వేధించాడు. సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా ఆమె నివసిస్తున్న పక్కవీధి అబ్బాయి.. ఆమె వెంటపడ్డాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలుడు విజిల్స్ వేస్తూ.. పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడు. కాసేపు ఓర్పుతో వున్న వివాహిత మైనర్‌కు వార్నింగ్ ఇచ్చింది. మరీ గట్టిగా బెదిరించకపోవడంతో ఆ పిల్లాడు మరింత రెచ్చిపోయాడు. 
 
ఈసారి బూతులు మాట్లాడుతూ... ఆమెపై అడ్డమైన కామెంట్లూ చేశాడు. ఇంటికి వెళ్లిన వివాహిత ఈ విషయాన్ని భర్తతో చెప్పుకుంది. అతను షాకై ఆ బాలుడి ఇంటికి వెళ్లాడు. తండ్రితో ఈ విషయాన్ని చెప్పాడు. భార్యను మైనర్ కుమారుడు వేధించాడని చెప్పాడు. కానీ మైనర్ పిల్లాడి తండ్రి మునిరాజు మాత్రం అడ్డం తిరిగాడు.
 
తాగిన మైకంలో వున్న అతడు.. తన కుమారుడు అలాంటి వాడు కాడని పొమ్మన్నాడు. కాదని వాగ్వివాదానికి దిగిన వివాహిత భర్తపై దాడి చేశాడు. తాగిన మైకంలో వున్న మునిరాజు క్రికెట్ బ్యాటుతో వివాహిత భర్త యోగేష్‌ను చితకబాదాడు. 
 
యోగేష్ తరపున మాట్లాడిన మరో వ్యక్తి దినకర్ కూడా గాయపడ్డాడు. తనను చంపేస్తానని మునిరాజు బెదిరించాడని ఈ మొత్తం వ్యవహారంపై బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు యోగేష్. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... బెయిల్‌పై రిలీజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. మొసలి నోట్లో పాము.. ఫోటోలు వైరల్