హిట్లర్ మీసంలా వుంది.. నెటిజన్ల కామెంట్స్.. లోగోను అమేజాన్ మార్చేసిందిగా!

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (10:16 IST)
Amazon
మింత్రా లోగో గురించే ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతోంది. తన లోగోను మార్చుకోవడంతో... పాత లోగో, కొత్త లోగో మధ్య తేడా ఏంటి అని నెటిజన్లు పరిశీలనగా చూశారు. తాజాగా ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ వంతైంది. ఈ కంపెనీ తన మొబైల్ యాప్ ఐకాన్‌ లోగోలో సీక్రెట్‌గా చిన్న మార్పు చేసింది. కానీ నెటిజన్లు కనిపెట్టేశారు. జనవరిలో అమెజాన్ ఈ మార్పు చేసింది. 
 
అంతకు ముందు షాపింగ్ కార్ట్ సింబల్‌తో లోగో ఉండేది. అందులో ఓ బ్రౌన్ బాక్స్ ఉంటుంది. దానిపై బ్లూ టేప్ అతికించినట్లుగా ఉంటుంది. ఇక కింద కంపెనీ స్మైల్ షేర్ బాణం ఉంటుంది. తమ కంపెనీ చక్కగా ప్యాక్ చేసి... డెలివరీ చేస్తుందని చెప్పేలా ఈ లోగో రూపొందించింది.
 
ఈ మధ్య పాత లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ప్రధానంగా బ్లూ టేపుపై పెద్ద డిబేట్ నడిటింది. అది నాజీ నేత, నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ మీసంలా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ కామెంట్ వైరల్ అయ్యింది. ప్రపంచమంతా పాకింది. దాంతో అమెజాన్ కంపెనీలో దానిపై చర్చ జరిగింది. 
 
దాంతో ఆమెజాన్ సీక్రెట్‌గా బ్లూ టేప్ లోగోలో మార్పులు చేసి... కొత్త లోగోను రిలీజ్ చేసింది. ఐతే... దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కానీ నెటిజన్లు కనిపెట్టేసి... అదిగో అమెజాన్ మార్చేసింది చూశారా అని నవ్వుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments