అమెజాన్ సంభవ్ రెండో ఎడిషన్ సదస్సును 2021 ఏప్రిల్ 15 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ముఖ్యమైన పరిశ్రమ పెద్దలను ఒక చోటుకు తెచ్చి, ఆత్మనిర్భర భారత్‌ని రూపొందిస్తూ వ్యాపారాలు, వాణిజ్యవేత్తలకి అవకాశాలు కల్పించేలా వారు అమెజాన్తో భాగస్వాములు కావడంపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
అమెజాన్ వారి వార్షిక సదస్సులలో ఈ రెండో ఎడిషన్ నాలుగు రోజుల పాటు వర్చువల్‌గా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పాదక, రిటైల్, లాజిస్టిక్స్, ఐటీ/ఐటీఈఎస్, కంటెంట్ క్రియేటర్లు, స్టార్టప్‌లు, బ్రాండ్లు తదితర రంగాలకు సంబంధించి భారతదేశంలో ఉన్న అపార అవకాశాలను అన్‌లాక్ చేయడం అనే థీమ్‌తో వీటిని నిర్వహిస్తున్నారు. అమెజాన్ సంభవ్లో 30 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. 70 మందికి పైగా వక్తల నుంచి వాళ్లు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ అలవాట్లు, ట్రెండ్ల గురించి తెలుసుకుంటారు.
అమెజాన్ వారి ప్రతిష్ఠాత్మకమైన సంభవ్ సదస్సు ఒక వర్చువల్ మెగా కార్యక్రమం. ఇందులో అమెజాన్, దాని భాగస్వాములు కలిసి భారతీయ వినియోగదారులు, వాణిజ్యవేత్తలు, చిన్న వ్యాపారులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఎలా సేవలు అందించవ్చన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తారు. సంభవ్ 2020లో 2025 నాటికల్లా భారతదేశంలో ఉన్న దాదాపు కోటి ఎంఎస్ఎంఈలలో 100 కోట్ల డాలర్ల అదనపు పెట్టుబడులు పెడతానని, వెయ్యి కోట్ల డాలర్ల ఎగుమతులను భారతదేశం నుంచి చేయిస్తానని, తద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అమెజాన్ మాటిచ్చింది.
“21వ శతాబ్దాన్ని భారతీయ శతాబ్దంగా చేయడంలో అమెజాన్ నిబద్ధత ఎంత బలంగా ఉంటుందో చూపించడంలో సంభవ్ 2021 ఒక ముందడుగు. భారతీయ వాణిజ్యవేత్తలు, వ్యాపారాలలో ఒక సరళితో పనిచేయడాన్ని కొనసాగిస్తూ.. భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన టూల్స్, సాంకేతికత, ఆవిష్కరణలను వారికి అందించేందుకు కట్టుబడి ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించి, అన్ని రకాల, అన్ని స్థాయిల కంపెనీలలో వాణిజ్య క్రియాశీలతను పెంపొందిస్తాం. ఆత్మనిర్భర భారత్‌ను సాధించే దిశగా ఈ అవకాశాలను పెంపొందించడానికి సంభవ్ 2021 ఒక విభిన్నమైన ప్లాట్‌ఫాం”అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ ఈ సదస్సులో అన్నారు.
కీనోట్ అడ్రస్‌లు, ప్యానల్ చర్చలు, వర్క్‌షాప్‌ల ద్వారా వక్తలు చెప్పే విషయాలను వర్చువల్‌గా ప్రేక్షకుల వద్దకు సంభవ్ 2021 తీసుకొస్తుంది. ఈ సదస్సు ప్రధానంగా నాలుగు మూల స్తంభాలైన ఇన్నోవేషన్, నైపుణ్యం- ఉద్యోగావకాశాలు, డిజిటైజేషన్, ఎగుమతులు - స్టార్టప్‌ల ప్రారంభం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిపెడుతుంది. తద్వారా సదస్సులో పాల్గొనేవారి అవసరాలను తీరుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిష్కారకర్తలు, అమెజాన్ నాయకత్వం లాంటి వారిని ఒక చోటుకు తీసుకొచ్చి, భారతదేశ వృద్ధికి చాలా అవసరమైన రంగాలపై చర్చిస్తుంది.
ఈ సదస్సులో కీలక అంశం వార్షిక “అమెజాన్ సంభవ్ అవార్డులు”. వీటిద్వారా తమతమ రంగాల్లో అద్భుతమైన పురరోగతి సాధించి, ఆత్మనిర్భర భారత్‌ను రూపొందిచడంలో తమవంతు సేవ చేసిన వ్యాపారాలు, ఆవిష్కర్తలు, వ్యక్తులను గుర్తిస్తారు. దాంతోపాటు నగదు బహుమతులు, ఏడబ్ల్యుఎస్ క్రెడిట్లు, వీసీ మెంటార్‌షిప్ అవకాశాలను విజేతలకు అందించేదుకు అమెజాన్ సంస్థ అమెజాన్ సంభవ్ స్టార్టప్ పిచ్ కాంపిటీషన్ కూడా నిర్వహిస్తుంది. దాంతోపాటు బిజినెస్ ఇన్నోవేషన్, సస్టెయినబులిటీ, హెల్త్‌కేర్ రంగాల్లో వచ్చే వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు అద్భుతమైన ఆలోచనలను పంచుకునే వ్యక్తులు, స్టార్టప్‌లకు ఒక అవకాశం కల్పించడానికి అమెజాన్ సంభవ్ హాకథాన్‌ను అమెజాన్ నిర్వహిస్తుంది.