Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో ‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ రెండవ ఎడిషన్‌ ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

హైదరాబాద్‌లో ‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ రెండవ ఎడిషన్‌ ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌
, గురువారం, 17 డిశెంబరు 2020 (18:37 IST)
ఇన్‌స్టాగ్రామ్‌ నేడు తమ ‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ కార్యక్రమ రెండవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం, సృజనపరులకు ఇన్‌స్టాగ్రామ్‌పై అత్యుత్తమంగా ఆధారపడే జ్ఞానాన్ని అందించడంతో పాటుగా 2020లో జోడించిన నూతన ఫీచర్లతో మరీ ముఖ్యంగా రీల్స్‌పై దృష్టి కేంద్రీకరించి తమ కథలను చెప్పే సామర్థ్యమూ మెరుగుపరుస్తుంది.
 
దశాబ్దపు ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పూర్తి చేసింది. ఈ ప్రయాణం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ యువత, క్రియేటర్లపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చెందింది. ఈ పరిణామక్రమంలో కేవలం ఫోటో షేరింగ్‌ యాప్‌ నుంచి కథలను జోడించడం, లైవ్‌, ఐజీటీవీ మరియు ఇప్పుడు రీల్స్‌ జోడించడం వరకూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌పై నూతన ఫీచర్‌ రీల్స్‌, ప్రజలు స్వల్ప వినోదాన్ని సృష్టించి, పంచుకోవడానికి ఇది అనుమతిస్తుంది. దీనిలో ఉన్న అద్భుత అంశం ఏమిటంటే రీల్స్‌ కోసం మీకు పెద్దగా ఫాలోయింగ్‌ ఉండాల్సిన అవసరం లేదు.
 
అత్యుత్తమ కంటెంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యొక్క భారీ మరియు వైవిధ్యమైన కమ్యూనిటీ పూర్తిగా అంకితం చేయబడిన రీల్స్‌ ట్యాబ్‌ మరియు స్పేస్‌ ఇన్‌ ఎక్స్‌ప్లోర్‌ ద్వారా కనుగొనవచ్చు. క్రియేటర్లు అయినటువంటి షగున్‌ సేన్‌ (@eattripclick), ఆకాంక్ష కొమ్మిరెల్లి (@akankshakommirelly) మరియు కార్తీక్‌ అభిరామ్‌ (@karthikabhiram) ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌పై రీల్స్‌ ఆవిష్కరించిన నాటి నుంచి విజయం సాధించారు.
webdunia
బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కార్యక్రమం వరుసగా తమ రెండవ సంవత్సరం జరుగబోతుంది. క్రియేటర్ల యొక్క వృద్ధి, వారిని కనుగొనడంపై ఇది దృష్టి కేంద్రీకరించినప్పటికీ ప్లాట్‌ఫామ్‌పై నూతన ఫీచర్లపై ఇది ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుంది. మనీష్‌ చోప్రా, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ పార్టనర్‌షిప్స్‌, ఫేస్‌బుక్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వినూత్న కార్యక్రమం. క్రియేటర్ల కోసం సంస్ధాగత అభ్యాస వాతావరణం ఇది సృష్టిస్తుంది. తద్వారా వారు అత్యుత్తమంగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడగలరు. సృజనాత్మకత మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడంపై మేము దృష్టి సారించాము. హైదరాబాద్‌లోని క్రియేటర్లలో దీనిని మేము చూశాము. తద్వారా భారతదేశంలో తరువాత తరపు అతిపెద్ద కంటెంట్‌ క్రియేటర్లను గుర్తించి ప్రోత్సహించనున్నాం’’ అని అన్నారు.
 
ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా కంటెంట్‌ క్రియేటర్లకు తెరిచి ఉంచబడింది. ఇది విస్తృతస్థాయి ప్రయోజనాలను ఆరు నెలల పాటు అందిస్తుంది. వీటిలో ముఖాముఖి పార్టనర్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాట్‌ఫామ్‌పై అత్యుత్తమ ప్రక్రియలపై సదస్సులు, వీడియో స్టోరీ టెల్లింగ్‌ టెక్నిక్స్‌, సెలబ్రిటీ క్రియేటర్ల మెంటార్‌షిప్‌, క్రియేట్‌-టుగెదర్‌ అవకాశాలు మరియు ఇతర ఉపయుక్తమైన సదస్సులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి boireels.splashthat.com చూడొచ్చు. 
 
ఈ ప్రకటనను ఫేస్‌బుక్‌ ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా వద్ద చేశారు. భారతదేశంలో మార్పుకు కారణమయ్యే అత్యంత శక్తవంతమైన కథలను ప్రదర్శించేందుకు వేదికగా ఇది నిలుస్తుంది. తమ ఉత్పత్తులు, కార్యక్రమాలు మరియు ప్రయాణాలకు, భారతదేశ పురోగతికి తోడ్పడే పోసే ప్రణాళికలను తీసుకువస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసుస్‌ నోట్‌బుక్‌ పోర్ట్‌ఫోలియో: శక్తివంతమైన జెన్‌బుక్స్‌- వివోబుక్స్‌ ఆవిష్కరణ