తైవాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్ధ అసుస్, నేడు తమ కన్స్యూమర్ ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను విస్తరించినట్లు వెల్లడించింది. కన్వర్టబుల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటుగా శైలి, శక్తి మరియు పోర్టబిలిటీ సమ్మేళనంగా ఇది ఉంటుంది. ఇంటెల్ ఇవో వెరిఫైడ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ జెన్‌బుక్ ఫ్లిప్ 5 (యుఎక్స్371)తో పాటుగా జెన్‌బుక్ ఫ్లిప్ 13(యుఎక్స్363), నూతన మరియు అత్యాధునిక జెన్‌బుక్ 14(యుఎక్స్435) మరియు వివోబుక్ ఫ్లిప్14(టీపీ470) వంటివి ఉన్నాయి. ఈ ఆఫరింగ్స్‌ను మరింతగా ఆకట్టుకునేలా అత్యద్భుతమైన4కె నానో ఎడ్జ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే సైతం దీనిలో ఉంది. ఇది అసాధారణ రీతిలో వాస్తవ చిత్రాలను అలా్ట్ర వివిడ్ పాంటోన్ వాలిడేటెడ్ కలర్ యాక్యురెసీతో అందిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి అర్నాల్డ్‌సు, బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్, అసుస్ ఇండియా మాట్లాడుతూ, పలుచటి మరియు తేలిక పాటి విభాగంలో అగ్రగామిగా ఉండటంతో పాటుగా నూతన కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ల ద్వారా మేమిప్పుడు పనితీరు, సామర్థ్యం, అసాధారణ పనితీరు అందిస్తున్నాం. ఈ పూర్తి శ్రేణి 11వ తరపు ఇంటెల్ ప్రాసెసర్లు కలిగి ఉండటంతో పాటుగా అత్యద్భుతమైన 4కె ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను సైతం కలిగి ఉన్నాయి అని అన్నారు.
రాహుల్ మల్హొత్రా, డైరెక్టర్– కన్స్యూమర్ సేల్స్, ఇంటెల్ ఇండియా మాట్లాడుతూ సాటిలేని కంప్యూటింగ్ అనుభవాలను విప్లవాత్మక సాంకేతిక ఆవిష్కరణల ద్వారా అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇంటెల్ ఇవో వెరిఫైడ్ డిజైన్స్‌ను బ్యాటరీ, పనితీరు, కనెక్టివిటీ వంటి అంశాల పరంగా మరింత మెరుగైన ప్రదర్శన అందించేలా తీర్చిదిద్దాం. ఇంటెల్ ఐరీస్ ఎక్స్ గ్రాఫిక్స్‌తో 11వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు మెరుగైన ఉత్పాదకత, అత్యాధునిక కంటెంట్ సృష్టి, లీనమయ్యే వినోదం అందిస్తాయి అని అన్నారు.