Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సేవలకు అంతరాయం.. గుర్తించిన భారతీయుడు...

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:48 IST)
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలు కొన్ని నిమిషాల పాటు స్తంభించిపోయాయి. గూగుల్ ఐపీని హైజాకింగ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఐపీ హైజాకింగ్‌కు గురైనట్టు ఓ భారతీయుడు గుర్తించాడు. 
 
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.12 నుంచి 2.35 గంటల వరకు గూగుల్ సెర్చింజన్, అనలటిక్స్, మరికొన్ని క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలు పనిచేయలేదు. నైజీరియాకు చెందిన మెయిన్‌వన్ అనే ఒక చిన్న టెలికాం సంస్థకు చెందిన ఐపీ అడ్రస్ నుంచి గూగూల్‌కు చెందిన బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (బీజీపీ)పై దాడి చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ విషయాన్ని థౌజండ్ ఐస్ అనే సంస్థకు చెందిన భారతీయుడు అమిత్ నాయక్ తొలుత గుర్తించాడు. ఈ హైజాకింగ్ దాడిని గూగుల్ కూడా నిర్ధారించింది. అయితే, దాడికి గల కారణాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ఐపీ హైజాకింగ్ కారణంగా అమెరికా, రష్యా, చైనా, నైజీరియాల్లో గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments