హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 1.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 1.4 ఫోన్ ఫిబ్రవరి 3 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
1జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.7,200గా ఉండనుంది. ఈ ఫోన్ చార్‌కోల్, డస్క్, జోర్డ్ కలర్లలో లభించనుంది. భారత్‌లో లభ్యత, ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఎంట్రీలెవల్ విభాగంలో విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది.