Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వ్యాక్సిన్ ధరను నిర్ణయించిన మోడెర్నా!

Advertiesment
Pfizer
కరోనా వ్యాక్సిన్ ధరను మోడెర్నా కంపెనీ నిర్ణయించింది. ఇతర కంపెనీలు నిర్ణయించిన ధర కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ నిర్ణయించిన ధర రూ.1855 (25 డాల‌ర్లు) నుంచి రూ.2755 (37 డాల‌ర్లు) మ‌ధ్య ఉంటుంద‌ని ఆ సంస్థ సీఈవో స్టెఫానె బాన్సెల్ తెలిపారు. ఆయా ప్ర‌భుత్వాలు ఆర్డ‌ర్ చేసే డోసుల సంఖ్య ఆధారంగా త‌మ ధర ఉంటుందని తెలిపారు. 
 
25 డాల‌ర్లలోపు ధ‌ర‌తోనే వ్యాక్సీన్‌ను కొనుగోలు చేసేలా మోడెర్నాతో ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి యురోపియ‌న్ క‌మిష‌న్ చాలా రోజులుగా ప్ర‌య‌త్నిస్తోంది. త‌మ డీల్ ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని, యూర‌ప్ మొత్తానికి తామే వ్యాక్సీన్ డెలివ‌రీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు బాన్సెల్ వెల్ల‌డించారు. 
 
త‌మ వ్యాక్సీన్ క‌రోనా నివార‌ణ‌లో 94.5 శాతం ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు మోడెర్నా చెబుతోంది. అమెరికా సంస్థ ఫైజ‌ర్ కూడా త‌మ వ్యాక్సీన్ 95 శాతం ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగివచ్చిన డోనాల్డ్ ట్రంప్ - బైడెన్‌కు అధికార పగ్గాల బదిలీకి ఓకే!