Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

క్రిస్మస్‌కు ముందుగానే ఫైజర్ టీకాల పంపిణీ!

Advertiesment
Pfizer Vaccine
, గురువారం, 19 నవంబరు 2020 (12:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ ఫైజర్. అమెరికాకు చెందిన బయోఎన్‌టెక్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్ల కంటే ఇది 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ కోసం అనేక ప్రపంచ దేశాలు పెద్ద మొత్తంలో బుక్ చేసుకుంటూ, దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. 
 
అయితే, ఫైజ‌ర్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకాపై బ‌యోఎన్‌టెక్ సీఈవో ఉగుర్ సాహిన్ దీనిపై ఓ కామెంట్ చేశారు. యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబ‌ర్ రెండ‌వ వారంలో ఆమోదం ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగితే.. డిసెంబ‌ర్ మ‌ధ్య‌లో టీకాకు అనుమ‌తి ద‌క్కుతుంద‌ని,  క్రిస్మ‌స్ పండుగ లోపే డెలివ‌రీలు ప్రారంభం అవుతాయ‌ని ఉగుర్ సాహిన్ తెలిపారు. 
 
అమెరికా కంపెనీ ఫైజ‌ర్‌, జ‌ర్మ‌నీ భాగ‌స్వామి బ‌యోఎన్‌టెక్ సంయుక్తంగా కోవిడ్ టీకాను త‌యారు చేస్తున్నాయి.  మ‌హ‌మ్మారి అంతంలో ఈ టీకా అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ఫైజ‌ర్ పేర్కొన్న‌ది. తమ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని బుధవారం ఫైజ‌ర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన ఈ టీకా తుది ప్రయోగ ఫలితాలను ఫైజర్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల వారు, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని తెలిపింది. ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 45,576 కేసులు.. తెలంగాణాలో 1,058 పాజిటివ్ కేసులు