Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బ్యాగ్స్ ఆన్ వీల్స్' పేరుతో డోర్ టు డోర్ సేవలకు రైల్వే శ్రీకారం!

'బ్యాగ్స్ ఆన్ వీల్స్' పేరుతో డోర్ టు డోర్ సేవలకు రైల్వే శ్రీకారం!
, శుక్రవారం, 23 అక్టోబరు 2020 (08:58 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే శాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టనుంది. "బ్యాగ్స్ ఆన్ వీల్స్" పేరుతో ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అంటే.. ప్రయాణికులకు ఇకపై తమ లగేజీని మోసే భారం తప్పతుంది. బ్యాగ్స్ ఆన్ వీల్స్ కింద రైల్వే శాఖ డోర్ టు డోర్ సేవలు ప్రారంభించనుంది. 
 
ఇటీవలి కాలంలో రైల్వే శాఖ ప్రయాణికులకు వివిధ రకాల సేవలు అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణం మరింత సులభతరంగా ఉండేందుకు పలు రకాలైన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రయాణికులకు లగేజీ తీసుకెళ్ళడం తలకు మించిన భారంగా మారింది. అందుకే 'బ్యాగ్స్ ఆన్ వీల్స్' పేరుతో డోర్ టు డోర్ సేవలను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
అంటే... ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను అందించనున్నట్టు తెలిపిన రైల్వే ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్‌ స్టేషన్లలో తొలుత ఈ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. 
 
ఇందుకోసం 'బ్యాగ్స్ ఆన్ వీల్స్' (బీవోడబ్ల్యూ) అనే మొబైల్ అప్లికేషన్‌ను తీసుకురాబోతోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులిద్దరికీ ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కానుంది.
 
ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించే సేవలు పొందవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు. అతి తక్కువ రుసుముతోనే డోర్-టు-డోర్ సేవలు అందిస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 
 
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తొలుత ఈ సేవలను న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగ్రామ్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సేవల వల్ల రైల్వే ఆదాయం మరింత పెరుగుతుందని ఢిల్లీ డీఆర్ఎం ఎస్‌సీ జైన్ పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే రైతుల కోసం కిస్సాన్ పేరిట ఓ ప్రత్యేక రైలును భారతీయ రైల్వే శాఖ నడుపోతుంది. ఈ రైలులో కేవలం రైతులు పండించే కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు వంటి వాటిని మాత్రమే తరలిస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ నుంచి ఢిల్లీకి ఓ కిస్సాన్ రైలు బయలుదేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకి మరణించిన భర్త.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే....