జీఎంఎం ఫౌడ్లర్ లిమిటెడ్ (జీఎంఎంపీ) జూలై 01, 2020వ తేదీన హైదరాబాద్‌లోని ది డైట్రిచ్ ప్రాసెస్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీడీపీఎస్‌ఐ) యొక్క గ్లాస్ లైన్డ్ సామాగ్రి తయారీ కేంద్రాన్ని సొంతం చేసుకుంది. ఈ అత్యాధునిక తయారీ సదుపాయం నాచారం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వద్ద 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ఈ సదుపాయాన్ని లాంఛన ప్రాయంగా అక్టోబర్ 02,2020వ తేదీన ప్రారంభించారు. తద్వారా వృద్ధి చెందుతున్న వినియోగదారుల పట్ల జీఎంఎం ఫౌడ్లర్ యొక్క సుదీర్ఘకాల నిబద్ధతను చూపుతుంది. ఈ సదుపాయంతో పాటుగా జీఎంఎం ఫౌడ్లర్ మరో రెండు కేంద్రాలను పశ్చిమ భారతదేశంలో గుజరాత్‌లోని కరాంసాద్ వద్ద మరోటి మహారాష్ట్రలోని పూణె వద్ద నిర్వహిస్తుంది.
దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండటంతో పాటుగా భారతదేశంలోని ఏడు నగరాలలో బలీయమైన అమ్మకాలు మరియు సర్వీస్ సపోర్ట్ టీమ్ కలిగి ఉంది. ఫార్మాస్యూటికల్ మరియు రసాయన పరిశ్రమలకు అవసరమైన ఇంజినీర్డ్ యంత్రసామాగ్రి మరియు సిస్టమ్స్‌కు ప్రాధాన్యతా సరఫరాదారునిగా జీఎంఎం ఫౌడ్లర్ వ్యవహరిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ తారక్ పటేల్, మేనేజింగ్ డైరెక్టర్- జీఎంఎం ఫౌడ్లర్ మాట్లాడుతూ, ‘‘జూలైలో మేము డీడీపీఎస్‌ఐను సొంతం చేసుకున్నామని వెల్లడించిన అతి కొద్దికాలంలోనే ఈ కేంద్రంలో కార్యకలాపాలను ఆరంభించడం పట్ల మేము సంతోషంగానూ, గర్వంగానూ ఉన్నాం. ఈ సదుపాయం కేవలం మా గ్లాస్ లైన్డ్ సామాగ్రి తయారీ సామర్థ్యం వృద్ధి చేయడం మాత్రమే కాదు, ఫార్మాస్యూటికల్, రసాయన పరిశ్రమల నుంచి వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను సైతం గణనీయంగా తీర్చడంలో మాకు సహాయపడనుంది. ఈ ఎక్వైజేషన్‌తో జీఎంఎం ఫౌడ్లర్ మరింతగా ఈ పరిశ్రమలో తమ నాయకత్వ స్ధానాన్ని బలోపేతం చేసుకోనుంది’’ అని అన్నారు.