Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

మారటోరియం వడ్డీ.. క్రెడిట్ కార్డు రుణాలకే బెనిఫిట్.. ఎలాగంటే..?

Advertiesment
Interest
, సోమవారం, 5 అక్టోబరు 2020 (19:36 IST)
కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం గడువుకు సంబంధించి వడ్డీ మీద వడ్డీ పడకుండా ఉండే నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయంతో హోమ్‌లోన్ తీసుకున్న వారి కంటే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి వడ్డీమీద వడ్డీ మినహాయింపు వల్ల ఎక్కువ బెనిఫిట్ కలుగనుంది. క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలు కలిగిన వారికి ప్రయోజనం అధికంగా ఉండనుంది. 
 
క్రెడిట్ కార్డులపై వార్షిక వడ్డీ 19.5 శాతం నుంచి 42.2 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ బ్యాంక్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మినహాయింపు వల్ల కొంత వరకే ప్రయోజనం ఉంటుందన్నారు. 
 
వడ్డీ మీద వడ్డీ మినహాయించినా కూడా మారటోరియం పీరియడ్‌పై సాధారణ వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 8 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల పరిమితితో హోమ్ లోన్ తీసుకున్నాడు. ఇప్పటికి ఐదేళ్లు గడిచింది.
 
ఆరో ఏడాది నుంచి మారటోరియం అమలులోకి వచ్చింది. అంటే ఇంకా 15 ఏళ్ల పాటు లోన్ ఈఎంఐ కట్టాలి. రూ.50 లక్షల లోన్ తీసుకొని ఉంటే ఆరు నెలల మారటోరియం గడువులో రూ.1.75 లక్షల వడ్డీ పడుతుంది. దీన్ని రుణ గ్రహీత చెల్లించాల్సిందే.
 
వడ్డీ మీద వడ్డీ రూ.2,944 అవుతుంది. అంటే వడ్డీ మీద వడ్డీని మినహాయిస్తే అప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వారికి రూ.2,944 మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. రూ. కోటి రుణం తీసుకొని ఉంటే రూ.5,887 ఆదా అవుతుంది. రూ.2 కోట్లు అయితే వడ్డీ మీద వడ్డీ మినహాయింపు వల్ల రూ.11,774 మిగులుతుంది.
 
అదే క్రెడిట్ కార్డు ఉపయోగించే వారి విషయానికి వస్తే.. కార్డుపై రూ.లక్ష ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఉందని భావిస్తే.. అప్పుడు 2.99 శాతం పడుతుందని భావిస్తే.. అప్పుడు ఆరు నెలల మారటోరియం గడువులో రూ.17,940 వడ్డీ పడుతుంది. అదే వడ్డీ మీద వడ్డీ జత చేస్తే ఇది రూ.19,336కు పెరుగుతుంది. అంటే వడ్డీ మీద వడ్డీ మినహాయిస్తే మీకు రూ.1396 తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగతనం చేయడం ఎలా.. యూట్యూబ్ వీడియోలు చూసి.. ఓ వ్యాపారి..?