Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్‌-19 వ్యాక్సిన్.. ఎలుకలపై ప్రయోగం విజయవంతం..

కోవిడ్‌-19 వ్యాక్సిన్.. ఎలుకలపై ప్రయోగం విజయవంతం..
, గురువారం, 6 ఆగస్టు 2020 (17:00 IST)
అమెరికన్‌ ఫార్మా సంస్థ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కోవిడ్‌-19 నుంచి ఎలుకకు రక్షణ కల్పించింది. ఈ మేరకు చేసిన అధ్యయనాన్ని నేచర్‌ జనరల్‌లో ప్రచురించారు. మూడు వారాల వ్యవధిలో ఒక మైక్రోగ్రామ్‌ మోతాదు గల ఎంఆర్‌ఎంఏ 1273 వ్యాక్సిన్‌ను ఎలుకకు ఇవ్వగా ఇది వైరస్‌ను చంపే వ్యాధి నిరోధకాలను ఎలుక శరీరంలో ప్రేరేపించినట్లు పరిశోధనలో తేలింది. 
 
రెండో ఇంజక్షన్‌ ఇచ్చిన 5 నుంచి 13వారాల తరువాత కరోనా సోకిన ఎలుకల్లో ఊపిరితిత్తులు, ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం తొలగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ ఉపరితలంపై ఉన్న స్పైక్‌ ప్రోటీన్‌ అణు నిర్మాణాన్ని గుర్తించేందుకు శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని మోడెర్నా వ్యాక్సిన్‌లో ఉపయోగిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు అమెరికన్‌ ఫార్మా సంస్థ మోడెర్నా సీఈవో సెఫానే చెప్పారు.
 
కరోనా మహమ్మారి కాలంలో టీకా ధర "బాగా తక్కువ"గా వుంటుందని తెలిపారు బాన్సెల్. వైరస్ నియంత్రణలో ఉన్నప్పుడు ధర ఇతర వాణిజ్య వ్యాక్సిన్లకు అనుగుణంగా సాంప్రదాయ మార్కెట్‌ను అనుసరిస్తుందని చెప్పారు. 
 
మోడెర్నా వ్యాక్సిన్ mRNA-1273 అని పిలువబడుతోంది. ఈ COVID-19 వ్యాక్సిన్ సరఫరా కోసం దేశాల ద్వారా 400 మిలియన్ల డిపాజిట్లను అందుకున్నట్లు తెలిసింది. మోడెర్నా టీకాను సుమారు 30,000 మందికి ఇచ్చారు. తుది ప్రయత్నాల ఫలితాలు అక్టోబర్ నాటికి ఆశించబడతాయని బాన్సెల్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు చికిత్స కన్నా.. నివారణ మిన్న