Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏం చేస్తాం, కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేవరకూ ఆగాల్సిందే: పవన్ కళ్యాణ్

Advertiesment
ఏం చేస్తాం, కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేవరకూ ఆగాల్సిందే: పవన్ కళ్యాణ్
, శనివారం, 25 జులై 2020 (20:20 IST)
శ్రీ పవన్ కల్యాణ్ గారు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. సినిమాల చిత్రీకరణకు కరోనా వైరస్ ఇబ్బంది ఉంది. ఎవరికి వచ్చినా సమస్యే శ్రీ పవన్ కల్యాణ్ గారు నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరోవైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు.
 
కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారి సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ... ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ పవన్ కల్యాణ్ గారు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
 
ప్రశ్న: మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా?
కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చేవరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే : పవన్ కళ్యాణ్