Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు... కొత్త మార్గదర్శకాలు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:56 IST)
ఓటీటీ, డిజిటల్​ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్​ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, నోడల్​ అధికారి, రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. 
 
ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్​ మీడియాకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 
 
సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చిందని తెలిపారు. 
 
కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫ్​డ్​ చిత్రాలు ఉన్న కంటెంట్​ను 24 గంటల్లోగా తొలగించాలి." అని వివరించారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 
 
గ్రీవెన్స్​ అధికారి తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్​లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్​ ప్రసాద్​ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం