Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత వాట్సాప్ వెర్షన్‌లో సెక్యూరిటీ బగ్! కేంద్రం వార్నింగ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (15:22 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాత వాట్సాప్ వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇలాంటి ఓ సెక్యూరిటీ బగ్‌నే ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ ఇన్) గుర్తించింది. ఈ బగ్‌ను తీవ్రమైనదిగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో నోడల్ ఏజెన్సీగా సీఈఆర్టీ ఇన్ పని చేస్తుంది. వాట్సాప్‌లోని ఓ బగ్‌ను ఇది గుర్తించింది. వాట్సాప్ వీ2.22.16.12 వెర్షన్ వినియోగిస్తున్న వారు ఈ సెక్యూరిటీ బగ్‌కు ప్రభావితమవుతారని, అందువల్ల సీఈఆర్టీ ఇన్ పేర్కొంది. అందువల్ల ఆ వెర్షన్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లను ఓ హెచ్చరిక చేసింది. వాట్సాప్ కూడా ఈ సమాచారాన్ని చేరవసింది. 
 
అందువల్ల పాత వాట్సాప్ వెర్షన్ వాడుతున్నవారు తక్షణం కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పాత వెర్షన్ వాడుతున్న వారందరూ కొత్త వెర్షన్ మారాలని తెలిపింది. దీంతో ఈ బగ్స్‌ బారి నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది. కొత్త వెర్షన్ యాప్‌లో వాట్సాప్ ఈ సమస్యలను ఫిక్స్ చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments