చేదువార్త చెప్పిన గూగుల్ ప్లే.. వచ్చే యేడాది నుంచి...

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (07:43 IST)
ప్రముఖ నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పే ఇపుడు తన వినియోగదారులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే యేడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవల నిలివేయనున్నట్లు ప్రకటించింది. 
 
అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకుగాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటివరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగించే వారు. అలాగే, ఎలాంటి రుసుంను కూడా గూగుల్ వసూలు చేసేది కాదు. కానీ వచ్చే యేడాది నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
 
'2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్‌ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. 
 
గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​ - టూ - పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే యేడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీంతో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. 
 
ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Neha Sharma: నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

తర్వాతి కథనం
Show comments