Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

సూర్య సినిమా రిలీజ్ ఆగడానికి కారణం..?

Advertiesment
Surya
, శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:24 IST)
తమిళ హీరో సూర్య నటిస్తూ.. నిర్మించిన చిత్రం సూరారై పొట్రు. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూసేయడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలి అనుకున్నారు. సూర్య తన సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి థియేటర్ ఓనర్స్ సూర్యపై మండిపడ్డారు.
 
ఎవరు ఏమనుకున్నా... ఎలాంటి విమర్శలు చేసినా సూర్య మాత్రం తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. సూర్య తన స‌హ నిర్మాత గునీత్ మోంగాతో క‌లిసి ఓటీటీ విడుదల పై నిర్ణయం తీసుకోవడం, విడుదల తేదీని ప్రకటించడం జరిగిపోయింది. అయితే ఈ చిత్రం అనుకున్న టైమ్‌కి అంటే.. అక్టోబర్‌ 30న ఓటీటీలో విడుదల కావడం లేదు.
 
ఈ విషయం తెలియజేస్తూ.. హీరో సూర్య సోషల్‌ మీడియా వేదికగా ఓ లెటర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం చెప్పిన టైమ్‌కి విడుదల కాకపోవడానికి కారణం ఇంకా కొందరి నుంచి అనుమతులు రాకపోవడమే అని సూర్య తెలిపారు. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
 
ఇది నేషనల్‌ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. కావున వారి నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నాయని.. అందువల్లే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతానికి స్నేహానికి సంబంధించిన సాంగ్‌ని విడుదల చేసినట్లుగా సూర్య తెలిపారు. త్వరలో ఓటీటీలో రానున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ యాంకర్‌ను కాటేసిన కరోనా వైరస్ - సుడిగాలి సుధీర్ కూడా... ఏంటో ఆ లింకు?