Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్ యాంకర్‌ను కాటేసిన కరోనా వైరస్ - సుడిగాలి సుధీర్ కూడా... (video)

Advertiesment
హాట్ యాంకర్‌ను కాటేసిన కరోనా వైరస్ - సుడిగాలి సుధీర్ కూడా... (video)
, శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:53 IST)
బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్‌ను కరోనా వైరస్ కాటేసింది. తాజాగా ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్మి రష్మీ గౌతమ్ ధృవీకరించింది. 
 
ప్రస్తుతం రష్మీ గౌతమ్ బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపుపొందింది. అలాగే, వెండితెరపై కూడా అడపాదడపా మెరుస్తోంది. ఫలితంగా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె కరోనా వైరస్ బారినపడ్డారు. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. 
 
మరోవైపు రష్మి నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే కరోనా సోకడంతో... ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్త్‌డే బాయ్‌కు సర్‌ప్రైజ్ ... బీట్స్ ఆఫ్ "రాధే శ్యామ్"