కరోనా వైరస్ కారణంగా విదేశీ గడ్డపై క్రికెట్ ఆడేందుకు ప్రపంచ క్రికెట్ జట్లు జడుసుకున్నాయి. కానీ ఐపీఎల్ క్రికెట్ టోర్నీ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఇదే తరహాలో క్రికెట్ సిరీస్‌లు నిర్వహించాలని ఐసీసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆసీస్ పర్యటనకు వెళ్లే జట్టుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లుగా తెలుస్తోంది.
ప్రారంభ మ్యాచ్‌లు సిడ్నీ, కాన్‌బెర్రాలో జరగనుండగా వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా భారత జట్టుకు సంబంధించిన అతిథ్య ఏర్పాట్లను సమీక్షిస్తోంది.
క్వారెంటైన్, శిక్షణా సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెుదటి వన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 27న ఈ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్ పింక్ బాల్‌లో ఆడనున్నారు. డిసెంబర్ 17-21 మధ్య అడిలైడ్ ఓవల్‌లో వేదికగా మెుదటి టెస్ట్ జరాగాల్సి ఉంది. కోవిడ్ పరిమితుల దృష్ట్యా వేదికను మార్చే అవకాశం కనిపిస్తోంది.