Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మీట్‌ ఉచిత సేవలు బంద్ కానున్నాయా?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (11:22 IST)
Google Meet
గూగుల్ మీట్‌ ఉచిత సేవలు బంద్ కానున్నాయా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌, ఆన్‌లైన్‌ క్లాసులతో ఎంతో మందికి చేరువైన యాప్‌ గూగుల్ మీట్. లాక్‌డౌన్‌‌తో అనేకమంది దీన్ని ఉపయోగించారు. దీంతో ఈ యాప్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు గూగుల్ మే నెలలో ప్రకటించింది. తాజాగా మీట్ ఉచిత సేవలను సెప్టెంబరు 30 తేదీ నుంచి గూగుల్ నిలిపివేయాలనుకుంటుంది. 
 
ఈ మేరకు గూగుల్ మీట్‌లో ఎలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకురావట్లేదని గూగుల్ వెల్లడించినట్లు ది వెర్జ్‌ అనే టెక్‌ వార్తా సంస్థ తెలిపింది. దీంతో యూజర్స్‌ గతంలోలా ఒక మీట్ కాల్‌ను కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడగలరు. ఇక మీదట అపరిమిత కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉండదు. అయితే నిలిపివేతకు కారణం తెలియరాలేదు.
 
గతంలో గూగుల్‌ డ్యూయో, మీట్‌ కలిసిపోనున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. రెండు యాప్‌లు ఒకే తరహా సేవలను అందిస్తుడటంతో వాటిని కలిపివేయాలని గూగుల్ భావించింది. అయితే వివిధ కారణాలతో దీనిని వాయిదా వేశారు. 
 
దానికి బదులుగా గూగుల్ మీట్‌లో అపరిమిత కాల్స్‌ చేసుకోవడంతో పాటు ఒకే సారి 49 మందితో మాట్లాడే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే మీట్ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు నాయిస్‌ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌ ఫీచర్స్‌, క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ను పరిచయం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments