Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవర్‌బ్యాంక్‌తో స్మార్ట్ ఫోన్లు.. 2 రోజులు మాట్లాడొచ్చు.. 5 రోజులు పాటలు వినొచ్చు..

Advertiesment
పవర్‌బ్యాంక్‌తో స్మార్ట్ ఫోన్లు.. 2 రోజులు మాట్లాడొచ్చు.. 5 రోజులు పాటలు వినొచ్చు..
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (16:08 IST)
Blackview BV9100
పవర్‌బ్యాంక్ వంటి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో వచ్చాయి. పబ్జీ వంటి యాక్షన్ గేమ్ ఆడాలనుకుంటే 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లలో 22 గంటలు ఆడుకునే వీలుంది. ఇంతే శక్తివంతమైన బ్యాటరీతో 24 గంటల కంటే ఎక్కువ వీడియోను చూడవచ్చు. అదే సమయంలో 5 రోజుల కంటే ఎక్కువ పాటలు వినవచ్చు. 50 గంటలకు పైగా అంటే 2 రోజుల వరకు మాట్లాడవచ్చు.
 
బ్లాక్‌వ్యూ బీవీ9100 అనే ఈ పవర్ బ్యాంక్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లో 13,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇది త్వరగా ఛార్జింగ్‌ అవుతుంది. రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. 60 గంటల వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడే అవకాశాలున్నాయి. ఫోన్ 6.3-అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్ప్లేని కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్‌. దీనిలో 16.0 + 0.3 ఎంపీ మెగాపిక్సెల్ వెనుక, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 2.3 జీహెచ్‌జడ్‌ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఫోన్ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్ నిల్వను కలిగి ఉన్నది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ 68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తున్నది.
 
క్విక్‌టైల్ కే10000 ఎంటీ6735
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉన్నది. ఇది త్వరగా ఛార్జింగ్‌ చేయడానికి మద్దతు ఇస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఫోన్ 5.5-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1280 x 720 పిక్సెల్స్. దీనిలో 13 ఎంపీ మెగాపిక్సెల్ వెనుక, 5 ఎంపీ ముందు కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 1.0 జీహెచ్‌జడ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో 16 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇలా క్విక్‌టైల్ కే10000 ఎంటీ6735, డూజీ ఎన్ 100, బ్లాక్‌వ్యూ బీవీ 9500 ప్రో, ఉలేఫోన్ పవర్ 5 అనే పవర్ బ్యాంక్ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎథర్ 450X కలెక్టర్ ఎడిషన్ సీరిస్1ని ఆవిష్కరించిన ఎథర్ ఎనర్జీ