కొత్త పాలసీ.. జీ-మెయిల్‌ ఇకపై జూన్‌-1 నుంచి గూగుల్‌ స్టోరేజీ పాలసీ

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (17:34 IST)
Gmail
జీ-మెయిల్‌ ఇకపై జూన్‌ 1 నుంచి గూగుల్‌ స్టోరేజీ పాలసీ మారనుంది. ఇప్పటి నుంచి గూగుల్‌ యాప్స్‌ బ్యాకప్‌ చేసే ఫైల్స్‌ అన్నీ వినియోగదారులకు లభించే 15జీబీ ఉచిత స్టోరేజీ కిందకే వస్తాయి. గూగుల్‌ హై క్వాలిటీ ఫోటోస్‌ బ్యాకప్‌ ఫైల్స్‌ కోసం అన్‌ లిమిటెడ్‌ స్టోరేజీని అందించేది. అది గతంలో అంటే ఫోటో స్టోరేజీతో పాటు అదనంగా 15జీబీ లభించేది. కానీ, తాజా మార్పుల తరువాత దీనికి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి.  
 
ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో డేటాను స్టోర్‌ చేసుకోవడానికి 15ఎఆ వరకు ఉచిత స్టోరేజీ లభిస్తుంది. జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్, ఇతర గూగుల్‌ సేవలను సొంతం చేసుకోవచ్చు. కానీ జూన్‌ 1 నుంచి బ్యాకప్‌ చేసుకునే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు కూడా ఈ 15 జీబీ ఉచిత స్టోరేజీ కిందకే వస్తాయి. అంటే జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్‌ వంటి అన్ని ఇతర గూగుల్‌ సేవలకు సంబంధించిన డేటా మాత్రమే ఉచితంగా బ్యాకప్‌ చేసుకోవచ్చు. 
 
అది మించితే అదనపు డేటా కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టోరేజీ పరిమితంగా ఉంది కాబట్టి, గూగుల్‌ బ్యాకప్‌ లిస్ట్‌లో అనవసరమైన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకోవాల్సి వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments