Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌లో ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్తున్న ఇండియా సంస్థ...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:25 IST)
ఇంటర్నెట్ వినియోగం ఎక్కువవుతున్న కొద్దీ యూట్యూబ్ వీక్షకులు పెరిగిపోతున్నారు, మరీ ముఖ్యంగా ఇండియాలో. ప్రముఖ సంస్థలే కాకుండా యువత కూడా యూట్యూబ్‌లో వ్యక్తిగతంగా ఛానెల్‌లను కొనసాగిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. యూట్యూబ్‌లో అన్ని అంశాలు సబ్‌స్క్రైబర్ల సంఖ్యతోనే ముడిపడి ఉంటాయి.
 
ఛానెల్ కొనసాగాలంటే కనీస సబ్‌స్క్రైబర్ల సంఖ్య, కనీస వీక్షణల సంఖ్య తప్పనిసరి. సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యలో మొదటి స్థానం దక్కించుకున్న సంస్థ ఫ్యూడిఫై. అయితే ఇప్పుడిప్పుడే భారతీయ సంస్థ టి సిరీస్ దీనికి గట్టి పోటీ ఇస్తోంది.
 
"ఫ్యూడిఫై" సంస్థను ఫెలిక్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రెండు సంస్థలకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గమనిస్తే ఫ్యూడిఫై కంటే టి సిరీస్‌కు 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే తక్కువగా ఉన్నారు. టి సిరీస్ జోరు చూస్తుంటే త్వరలోనే మొదటి స్థానం సంపాదించుకుని, ఫ్యూడిఫైను వెనక్కు నెట్టేసేలా ఉంది.
 
60 బిలియన్ల వీక్షణలతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన టి సిరీస్ సంస్థను 1983లో గుల్షన్ కుమార్ స్థాపించారు. 2000లో సంస్థ బాధ్యతలను చేపట్టిన ఆయన వారసుడు గుల్షన్ భూషన్ డిజిటల్ మార్కెట్‌లో అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకోవడంతో సంస్థ దశ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఈ స్థాయికి చేరుకుంది, తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఫ్యూడిఫై ఎన్ని ఎత్తులు వేసినా టి సిరీస్ జోరును ఆపలేకపోతోంది. త్వరలో భారతీయ సంస్థ ఆ ఘనత సాధించడం కోసం ఎదురుచూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments