Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచిత డేటా? ఎలా?

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (10:04 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టారిఫ్‌లకు ఉచితంగా డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రీపెయిడ్ ధరల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెంచేసింది. అలాగే డేటా టాప్‌అప్ ప్లాన్లపై కూడా 20 నుంచి 21 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెరిగిన ధరలు శుక్రవారం అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్ సెలెక్టడ్ ప్లాన్స్‌పై ప్రతి రోజూ 500 ఎంబీ వరకు డేటాను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇది చాలా మంది యూజర్లకు సౌలభ్యంగా ఉండనుంది. 
 
మరోవైపు, ఎయిర్ టెల్ పెంచిన ధరల మేరకు.. ఇప్పటివరకు రూ.79గా ఉన్న బేసిక్ ప్లాన్ ఇపుడు రూ.99కు చేరింది. దీని కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. 
 
అలాగే, అన్‌లిమిటెండ్ వాయిసా కాల్ ప్లాన్‌ను రూ.149 నుంచి రూ.179కి పెంచేసింది. అలాగే, రూ.2498 ప్లాన్‌ను ఇపుడు ఏకంగా రూ.2999కు చేర్చింది. ఇది వార్షక ప్లాన్. 
 
అదేవిధంగా డేటా ప్లాన్‌లో డేటా టాప్‌అప్‌లో రూ.48 ప్లాన్‌ను ఇకపై రూ.58కి పెంచింది. అలాగే, రూ.98 ప్లాన్‌ను కొత్తగా రూ.118కు చేర్చింది. ఈ ప్లాన్ కింద 12 జీబీ డేటాను ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments