Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై తప్పుడు వార్తలు.. 70లక్షల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:03 IST)
సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ కరోనా గురించి తప్పుడు వార్తలలో పెట్టిన 70 లక్షల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెలల కాలంలోనే ఆయా పోస్టులను తొలగించినట్లు తెలిపింది. కరోనాపై కొందరు కావాలని తప్పుడు వార్తలను ప్రచారం చేశారని, అలాంటి వార్తలకు చెందిన పోస్టులను తాము తొలగించామని ఫేస్‌బుక్ తెలిపింది.
 
కాగా ఆయా నెలల్లో హేట్ స్పీచ్‌కు సంబంధించి 22.5 మిలియన్ల పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. జనవరి నుంచి మార్చి నెలల కాలంలో అలాంటి పోస్టులను 9.6 మిలియన్ల వరకు తొలగించింది. ఇక రెండో త్రైమాసికంలో టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు చెందినవిగా చెప్పబడిన 8.7 మిలియన్ల పోస్టులను తొలగించారు. గతంలో అవే పోస్టులను 6.3 మిలియన్ల వరకు తొలగించారు.
 
అయితే ఫేస్‌బుక్‌లో ఆయా పోస్టులను గుర్తించి వాటిని డిలీట్ చేసేందుకుగాను ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా గుర్తించి డిలీట్ చేయడం కష్టం కనుక అలా చేస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments