Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించి పెళ్లాడిన భార్యకు కరోనా అని తెలియగానే.. పారిపోయిన భర్త.. ఎక్కడ?

Advertiesment
ప్రేమించి పెళ్లాడిన భార్యకు కరోనా అని తెలియగానే.. పారిపోయిన భర్త.. ఎక్కడ?
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:36 IST)
కరోనా వైరస్ మానవీయ సంబంధాలను మంటగలుపుతోంది. తల్లిదండ్రులతో పాటు అగ్నిసాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన భర్త కూడా కరోనా వచ్చిందని తెలియగానే విడిచి పారిపోయాడు. చివరికి ఆంబులెన్స్‌ సాయంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
భార్యకు కరోనా సోకిందని తెలుసుకున్న భర్త ఆమెను వదిలేసి పరారయ్యాడు. అయితే కొద్ది సేపటికి ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె శ్వాస సమస్యలతో ప్రాణాలు కోల్పోయింది. 
 
చివరకు కార్పొరేషన్‌ అంబులెన్స్‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. వివరాల్లోకి వెళితే.. గౌరి (27), మంజునాథ్‌ రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. 
 
గౌరీ షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తుండగా భర్త మరో చోట డ్రైవర్‌‌గా పనిచేస్తున్నారు. మొన్న ఆమెకు జ్వరం రాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని వచ్చారు. రెండో రోజు ఆమెకు కరోనా పాజిటివ్‌ అని ఫోన్‌ చేసి చెప్పారు.
 
దీంతో భర్త ఆ మరుక్షణమే భార్యను వదిలిపెట్టి ఉడాయించాడు. ఆమెకు శ్వాసకోశ సమస్య అధికం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది. ఇంటి యజమాని మంజునాథ్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అతను స్పందించలేదు. 
 
చివరికి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. మృతురాలి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పగా, ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లినరోజు నుంచే తమకు వారికి సంబంధం తెగిపోయిందని చెప్పే శారు. చివరకు కార్పొరేషన్‌ అంబులెన్స్‌‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి.. లాక్కెళ్లి చంపి తినేసిన చిరుతపులి