Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో ఇక మీ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..!

Webdunia
గురువారం, 21 మే 2020 (20:01 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌‍బుక్‌ ఉపయోగించే యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ లిస్టులో లేనివారు కూడా ఇతరుల ప్రొఫైల్ చూడొచ్చుననే సంగతి తెలిసిందే. బ్లాక్ చేసుకుంటే మినహా ప్రొఫైల్‌ను ఇతరులు చూసేందుకు వీలుండదు. అయితే  ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారు మాత్రమే ప్రొఫైల్ చూసేలా ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఫేస్‌బుక్. 
 
ఫేస్‌బుక్‌ యూజర్ల ప్రొఫైల్‌ భద్రతకు సంబంధించి ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవడానికి ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్‌లో పేరు కింద మోర్‌ అనే ఆప్షపై క్లిక్‌ చేస్తే ''లాక్‌ ప్రొఫైల్‌ '' అనే ఆప్షన్ వస్తుంది. దానిని సెలెక్ట్‌ చేసి.. కన్ఫర్మ్‌ చేసి మరోసారి క్లిక్‌ చేస్తే మీ ప్రొఫైల్‌ లాక్‌ అవుతుంది. ఒక వేళ మీరు తిరిగి మీ ప్రొఫైల్‌ను అన్‌లాక్‌ చేయాలంటే ''యువర్‌ ప్రొఫైల్ ఈజ్‌ లాక్డ్'' పై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ అనే ఆప్షన్ సెలెక్ట్‌ చేస్తే అన్‌లాక్ అయిపోతుంది.
 
రాబోయే రెండు వారాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే ఫ్రెండ్ లిస్టులో లేని వ్యక్తులు ప్రొఫైల్ చూసే అవకాశం వుండదు. దీంతో వ్యక్తిగత వివరాలకు మరింత భద్రత కల్పించినట్లు అవుతుందని ఫేస్‌బుక్ తెలిపింది.
 
ఈ కొత్త ఫీచర్ కారణంగా ప్రొఫైల్‌, కవర్‌ ఫొటోలు డౌన్‌లోడ్ చేయడం, వాటిని షేర్‌ చేయడం, ఖాతాలో ఉన్న ఫొటోలను చూడడం, టైమ్‌లైన్‌లో పోస్టింగ్‌లు చేయడం వంటివి చేయలేరు. ఒక్కసారి మీ ప్రొఫైల్‌ లాక్‌ అయితే, ప్రొఫైల్ లాక్డ్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. మహిళలు ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments