టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న కోమరం భీమ్ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో విడుదల కావాల్సివుంది. కానీ, అనివార్య కారణాల రీత్యా వీడియో ప్రోమో వీడియోను చేయలేక పోయారు. అంతేకాకుండా, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.
దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే అభిమానులు ఎవరూ నిరాశ చెందవద్దని... ఈ సినిమా సంచలనం సృష్టించబోతోందంటూ వారిలో నూతనోత్సాహాన్ని ఎన్టీఆర్ నింపాడు.
మరోవైపు, అభిమానుల కోరికను ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీర్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన ఎన్టీఆర్ పిక్ విడుదలైంది.
ఈ ఫొటోలో కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోను చూసి తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.