Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకి ఝలక్ ఇచ్చిన ఎయిర్ టెల్- క్యాష్‌బ్యాక్ ఆఫర్

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (18:17 IST)
జియోకి ఝలక్ ఇచ్చింది ఎయిర్‌టెల్. దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్స్ ని తీసుకు రావడం జరిగింది. దీనితో ఇది జియోకి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఎయిర్‌టెల్ తమ కస్టమర్స్ కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. అయితే ఈ ఆఫర్ లో భాగంగా రూ.12 వేలలోపు ధరలో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
దీనిలో శాంసంగ్, షావోమి, వివో, ఒప్పొ, రియల్‌మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్‌ఫినిక్స్, టెక్నో, లెనొవొ, మోటరోలా వంటి ఫోన్లు వున్నాయి. వీటిలో ఏదైనా ఫోన్ ని కస్టమర్స్ కొనాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఫోన్ కొనుగోలు చేసిన వాళ్లకి రూ.6 వేల క్యాష్‌ బ్యాక్ వస్తుంది. అయితే ఫోన్ ని కొనుగోలు చేసిన వారు 36 నెలల పాటు వారి ఎయిర్‌టెల్ నెంబర్‌ను రూ.249 లేదా ఆపైన రీచార్జ్ ప్లాన్లతో ఫోన్ రీచార్జ్ చేసుకోవాలి.
 
ఇలా చేస్తే కస్టమర్లకు రెండు విడతల్లో క్యాష్‌బ్యాక్ వస్తుంది. 18 నెలల తర్వాత రూ.2 వేల క్యాష్‌బ్యాక్ వస్తుంది. మిగతా రూ.4 వేల క్యాష్‌బ్యాక్ 36 నెలల తర్వాత చెల్లిస్తారు. అదే విధంగా ఆఫర్‌లో భాగంగా ఫోన్ కొన్న వారికి ఒకసారి స్క్రీన్ రిప్లేస్‌మెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 90 రోజుల్లోగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments