Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థికంలో ముగ్గురుకి నోబెల్ పురస్కారం

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (18:05 IST)
ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించంది. ఈ అవార్డును గెలుచుకున్న వారిలో అమెరికా శాస్త్ర‌వేత్త‌లు డేవిడ్ కార్డ్‌, జాషువా డీ. ఆంగ్రిస్ట్‌, గైడో డ‌బ్ల్యూ ఇంబెన్స్‌లు ఉన్నారు. 
 
డేవిడ్ కార్డ్‌కు సగం పుర‌స్కారం ద‌క్క‌గా మ‌రో ఇద్ద‌రు స‌గం ప్రైజ్‌మ‌నీ పంచుకోనున్నారు. లేబ‌ర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు కొత్త అంశాల‌ను వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా ప‌రిశోధ‌న‌ల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది. 
 
అమెరికాలోని బెర్క్‌లేలో ఉన్న కాలిఫోర్నియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డేవిడ్ కార్డ్‌కు స‌గం బ‌హుమ‌తి ద‌క్క‌నుంది. కార్మిక ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి కార్డ్ కొన్ని సూచ‌న‌లు చేశారు. అమెరికాలోని మ‌సాచుసెట్స్ టెక్నాల‌జీ ఇన్స్‌టిట్యూట్ ప్రొఫెస‌ర్ జాషువా, స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గైడో ఇంబెన్స్‌లు.. క్యాజువ‌ల్ రిలేష‌న్‌షిప్స్‌ను విశ్లేషించారు. స‌హ‌జ ప‌రిశోధ‌న‌ల ద్వారా ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్ర‌వేత్తలు సంచ‌ల‌నాత్మ‌క అంశాల‌ను వెల్ల‌డించినందుకు ఈ పురస్కారం వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments